Food Challenge Video: భోజన ప్రియులకు బంపర్‌ ఆఫర్‌ థాలీ తినండి.. లక్ష సొంతం చేసుకోండి.. మన దగ్గరే ఈ ఛాలెంజ్..(వీడియో)

Food Challenge Video: భోజన ప్రియులకు బంపర్‌ ఆఫర్‌ థాలీ తినండి.. లక్ష సొంతం చేసుకోండి.. మన దగ్గరే ఈ ఛాలెంజ్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 12, 2022 | 9:18 AM

ఒక్క థాలీతో లక్షాధికారి అయిపోయాడు ఓ యువకుడు. ఎలా అంటారా... ఇదిగో ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని తినగలిగే కస్టమర్లకు అక్షరాల లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.


ఒక్క థాలీతో లక్షాధికారి అయిపోయాడు ఓ యువకుడు. ఎలా అంటారా… ఇదిగో ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని తినగలిగే కస్టమర్లకు అక్షరాల లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ” హాయిగా కూర్చుని తిని లక్షలు సంపాదించాలని ఉందా.. అయితే నాయుడుగారి కుండ బిర్యానీకి (Nasidugari kundabiryani)కి రండి.. అంటూ ఒక వీడియో ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఈ పెద్ద థాలీలో వడ్డించిన వంటకాలు ఉన్నాయి. ఈ ప్లేట్ లో కుండ బిర్యానీ, అన్నం, రకరకాల కూరలు, స్వీట్స్, నూడిల్స్ వంటి పలు వంటకాలు ఉన్నాయి. అంతేకాదు ఈ థాలీలో నాలుగు రకాల పానీయాలు కూడా ఉన్నాయి. దీనిని ‘బాహుబలి థాలీ ‘అంటారు. ఈ థాలీని ఎవరైనా 30 నిమిషాల్లో తినగలిగితే వారు ఒక లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ థాలీని విజయవాడ లోని నాయుడుగారికుండబిర్యానీ రెస్టారెంట్ వడ్డిస్తోంది.సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఐటమ్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇవన్నీ 30 నిమిషాల్లో ఇద్దరు వ్యక్తులు తినడం చాలా కష్టమే అని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే భోజన ప్రియులు.. ఆహార పోటీల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ థాలీని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక యువకుడు ఆ బాహుబలి థాలీలోని అన్ని రకాల వంటలను ఆహా ఏమి రుచి అంటూ తినేశాడు. అక్షరాల లక్ష రూపాయలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోటీలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.