Security Guard: కాళ్లు బయట, బాడీ లిఫ్టులో.. లిఫ్టులో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డ్.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో మహేందర్ గౌడ్ అనే సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. రెండు కాళ్లు బయట లిఫ్ట్ లోపల మిగిలిన శరీరం ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు మహేందర్. ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో మహేందర్ గౌడ్ అనే సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. రెండు కాళ్లు బయట లిఫ్ట్ లోపల మిగిలిన శరీరం ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు మహేందర్. ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న HDFC హౌసింగ్ లోన్ కార్యాలయంలో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్ రూముకు లిఫ్ట్ లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు. సుమారు గంట పాటు అరుపులు కేకలు పెట్టాడు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది దాదాపు అరగంట సేపు శ్రమించి బయటకు తీశారు. గతంలోనూ ఈ కాంప్లెక్‌లో అనేక ప్రమాదాలు సంభవించినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా లిఫ్టు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పినా కాంప్లెక్స్ యజమాని నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వాచ్‌మన్ ప్రాణాల మీదికొచ్చిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా యజమానిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos