మిస్‌ అయిన సెల్‌ఫోన్‌.. విమానంలోంచి వంగి మరీ అందుకున్న పైలట్‌

|

Nov 22, 2022 | 6:20 AM

విమానం టేకాఫ్‌ సమయం దగ్గర పడింది. ప్రయాణికులంతా హడావిడిగా విమానం ఎక్కేసారు. ఇక బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌ గేట్‌ వద్ద మర్చిపోయాడు.

విమానం టేకాఫ్‌ సమయం దగ్గర పడింది. ప్రయాణికులంతా హడావిడిగా విమానం ఎక్కేసారు. ఇక బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌ గేట్‌ వద్ద మర్చిపోయాడు. అది గమనించిన గ్రౌండ్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఫోన్‌ తీసుకొని టేకాఫ్‌ అవుతున్న విమానం దగ్గరకి పరుగెత్తారు. విషయం గ్రహించిన పైలట్‌ టేకాఫ్‌ అయిన విమానం కిటికీలోంచి వంగి సిబ్బంది దగ్గరనుంచి ఆ ఫోన్‌ అందుకున్నాడు. అనంతరం ఆ ఫోన్‌ మర్చిపోయిన వ్యక్తికి అందించారు.ఈ ఘటన కాలిఫోర్నియాలోని లాంట్‌ బీజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్‌ ఎయిర్‌లైన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ…మా సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్

ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..

Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!

Follow us on