దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా

Updated on: Nov 17, 2025 | 1:10 PM

సంక్రాంతి, దసరా వేషాల మాదిరిగా యూరప్‌లో హాలోవీన్ వేడుకలు విస్తరిస్తున్నాయి. రిమోట్ కంట్రోల్డ్ హాలోవీన్ బొమ్మలు జంతువులను, ముఖ్యంగా ఎలుగుబంటిని భయపెట్టడం ద్వారా వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డై నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ ఫన్నీ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పూయిస్తున్నాయి.

మన దగ్గర సంక్రాంతికి, దసరాకు రకరకాల వేషాలు వేస్తుంటారు. పులి వేషాలు, కొమ్మదాసరి ఇలా రకాల వేషాలతో వచ్చి ప్రజలను అలరిస్తుంటారు. ఇలానే యూరప్‌లో హాలోవీన్స్‌ పేరుతో రకరకాల వేషధారణలతో పోటీలు సరదాగా సాగిపోతుంటాయి. ఒకప్పుడు యూరప్‌ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది. భారత్‌లోనే ఇటీవల రకరకాల వేషధారణలతో ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి. పలు దేశాల్లో ఈ ఏడాది కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొంతమంది విచిత్ర వేషాధరణలో సందడి చేశారు. హాలోవీన్స్ డే రాత్రి.. కొందరు తమ ఇళ్ల వద్ద రిమోట్‌ కంట్రోల్డ్‌ బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాత్రి పూట ఇళ్ల పరిసరాల్లో తిరిగే జంతువులు హాలోవీన్స్ బొమ్మలను చూసి భయపడి పారిపోతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలు చూసి నెటిజన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి ఆవరణలో హాలోవీన్స్ రూపంలో ఉన్న రిమోట్ కంట్రోల్డ్ బొమ్మ ఉంది. రాత్రి ఆ ఇంటి ఆవరణలోకి ఓ పెద్ద ఎలుగుబంటి వచ్చింది. ఆ బొమ్మను మనిషిగా భావించి అక్కడకు వచ్చింది. ఎలుగుబంటి దగ్గరకు రాగానే ఆ బొమ్మలో లైట్‌ వెలిగి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దెబ్బకు భయపడిన ఎలుగుబంటి ఒక్కసారిగి పిల్లిమొగ్గ వేసింది. షాక్‌తో వెల్లకిలా పడిపోయింది. కాసేపటికి తేరుకున్న ఎలుగుబంటి ఓర్నీ ఇది బొమ్మా.. దీన్ని చూసా నేను భయపడ్డాను.. ఛ..అన్నట్టుగా ఆ బొమ్మను పక్కకు పడేసి వెళ్లిపోయింది. ఈ సీన్ అంతా ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఎలుగుబంటి భయపడిన తీరు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్‌ మాత్రం ఇది ఏఐ క్రియేటివిటీ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!

World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..

Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా

ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు

సరదాలకు శనివారం .. ఫ్యామిలీకి ఆదివారం .. మారిన ట్రెండ్‌