కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి

Updated on: Dec 22, 2025 | 12:23 PM

గ్వాలియర్‌లో అప్పుల వివాదంలో యువకుడు సౌరభ్ శర్మ కిడ్నాప్‌నకు గురయ్యాడు. రుణదాతలు అతన్ని బంధించగా, సౌరభ్ చాకచక్యంగా కిడ్నాపర్ల స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించాడు. తన లొకేషన్‌ను ప్రియురాలికి పంపించి, పోలీసులకు సమాచారం చేరేలా చేశాడు. టెక్నాలజీ సాయంతో ప్రాణాలతో బయటపడటమే కాకుండా, కిడ్నాపర్ల అరెస్ట్‌కు దోహదపడ్డాడు. ఈ ఘటన టెక్నాలజీ ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సినీఫక్కీలో ఓ కిడ్నాప్ జరిగింది. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేశారు. కాగా, ఆ యువకుడు టెక్నాలజీ వాడి.. తెలివిగా కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. విచిత్రం ఏంటంటే, తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించిన యువకుడు.. తన ఆచూకీని పోలీసులకు పంపటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. హరిద్వార్‌లో హోటల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సౌరభ్ శర్మ సెలవుల్లో గ్వాలియర్‌లో తన ఇంటికి వచ్చాడు. సౌరభ్ గతంలో వడ్డీ వ్యాపారులైన హేమంత్ , సచిన్ వద్ద రూ.2.90 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీ కింద ఇప్పటికే రూ.3.20 లక్షలు చెల్లించాడు. కానీ, వడ్డీ వ్యాపారులు మాత్రం చక్రవడ్డీ పేరిట మరో రూ.6 లక్షలు కావాలని అతడిని వేధించారు. ఈ క్రమంలో సెలవులకు సౌరభ్ ఇంటికి వచ్చిన సంగతి తెలుసుకుని.. నిందితులు బైక్‌పై వచ్చి అతడ్ని కొట్టుకుంటూ ఇంట్లోనుంచి తీసుకుని బయటకు తీసుకొచ్చారు. తమ బాకీ డబ్బు ఇవ్వకపోతే చంపుతామని వారు బెదిరించారు. తర్వాత అతడిని బైక్ మీద సౌరభ్ ను ఓ ప్రదేశంలోని గదిలో బంధించి, అతడి వద్ద ఉన్న ఫోన్‌ లాగేసుకుని, గదికి బయట తాళం వేసుకుని వెళ్లిపోయారు. సౌరభ్ మీద దాడిచేసే సమయంలో వడ్డీ వ్యాపారుల్లో ఒకడు..తన స్మార్ట్ వాచీ తీసి అక్కడే అల్మారీలో పెట్టి బయటకు వెళ్లేటప్పడు మరిచి పోయి వెళ్లాడు. ఆ వాచీ గదిలో దెబ్బలు తిని పడి ఉన్న సౌరభ్ కంటపడింది. వెంటనే స్మార్ట్‌వాచ్ సహాయంతో వెంటనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు కాల్ చేసి పరిస్థితి వివరించాడు. తన లొకేషన్‌ను షేర్ చేసారు. వెంటనే ఆమె, సౌరభ్ తండ్రికి సమాచారం అందించింది. సౌరభ్ తండ్రి నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు హేమంత్ ను అదుపులోకి తీసుకుని ఒత్తిడి చేయడంతో, సచిన్ భయపడి సౌరభ్‌ను విడిచిపెట్టాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై అక్రమ వడ్డీ వ్యాపారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. టెక్నాలజీని సరైన సమయంలో ఉపయోగించి సౌరభ్ తన ప్రాణాలను కాపాడుకోవడంపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసు మిస్టరీ వీడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే

గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ

అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా