ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు
ఈమధ్య చాలా మంది పిల్లల పుట్టిన రోజు, వెడ్డింగ్ యానివర్సరీ, తల్లిదండ్రుల బర్త్‌డే, వర్ధంతి, జయంతి కి అన్నదానాలు, పుస్తకాలు, దుస్తులు దానం చేస్తున్నారు. సూరత్ వ్యాపారవేత్త సోదరులు తమ తల్లి వర్ధంతి సందర్భంగా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ ఊర్లో ఉన్న 290 మంది రైతుల అప్పులను తీర్చారు. వారు జీవితాంతం తన తల్లి పేరును గుర్తుంచుకునేలా చేశారు.
గుజరాత్ ఆమ్రేలిలోని జీరా గ్రామం రైతులు వ్యవసాయం కోసమో, కుటుంబ అవసరాల కోసం రుణం తీసుకున్నారు అనుకుంటే పొరపాటే. చెప్పాలంటే.. ఈ రైతులు వారికే తెలియకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వీరి గ్రామంలోని సహకార మండలిలో 290 మంది రైతుల పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రుణాలు తీసుకున్నారు. సొసైటీ సభ్యులే ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. కానీ దీన్ని నిరూపించేందుకు ఆ రైతుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఇది ఇప్పటి సమస్య కాదు.. 30 ఏళ్ల నుంచి వారిని ఈ రుణ భారం వెంటాడుతోంది. పైగా ఈ రైతులకు చెందిన భూమి పత్రాలు సహకార సంఘంలోనే ఉండటంతో.. వీరికి ప్రభుత్వం నుంచి రుణాలు, సాయం పొందలేని పరిస్థితి. అన్నదమ్ములు, వారసుల మధ్య ఆస్తి పంపకాలూ నిలిచిపోయాయి. ఆడబిడ్డకు ఆస్తి పంచి ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ కుంభకోణం గురించి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏం చేయాలో.. ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో అర్థం కాక ఆ రైతులు మౌనం వహించారు. అయితే ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్య గురించి.. బాబూ భాయ్ జిరావాల్, ఆయన సోదరుడు ఘనశ్యామ్ భాయ్‌లకు తెలిసింది. దీంతో వారు తల్లి వర్ధంతి రోజున ఈ రైతులను రుణ విముక్తులను చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మొత్తం రూ.90 లక్షల రుణాన్ని ఏకమొత్తంగా బ్యాంకులో డిపాజిట్ చేశారు. రైతుల పేరు మీద ఉన్న రుణం తీర్చడంతో.. అధికారులు అన్నదాతల భూములకు సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు . ఏళ్లుగా పోరాడుతున్న సమస్క పరిష్కాం కావడమే కాక.. భూమి పత్రాలు తిరిగి తమ చేతికి రావడంతో.. రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమకు ఇంత గొప్ప సాయం చేసిన బాబూ భాయ్ జిరావాల్, అతడి సోదరుడు ఇద్దరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఇంత సాయం చేసిన ఈ సోదరులు.. ఎక్కడా కూడా తమ తల్లి పేరును ప్రస్తావించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ‘శభాష్ రామ్ చరణ్! మంచి నిర్ణయం తీసుకున్నావ్..’
బుద్ది లేనోడు.. గడ్డి తిన్నోడే.. అలా చేస్తాడు..
ఇలా అయితే అద్దె ఇంట్లో బతికేదెలా
