GTA Lay off: గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

|

Apr 19, 2024 | 1:01 PM

లేఆఫ్స్‌ ఉద్యోగులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను సాగనంపాయి. తాజాగా వీడియో గేమింగ్ కంపెనీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫ్రాంఛైజీ మేక‌ర్.. టేక్ -టూ ఇంట‌రాక్టివ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ లే ఆఫ్స్ ప్రక‌టించింది. వ్యయ నియంత్రణ‌, కంపెనీ కార్యక‌లాపాల క్రమ‌బద్ధీక‌ర‌ణ‌లో భాగంగా భారీ పున‌ర్వ్యవ‌స్ధీక‌ర‌ణ ప్రణాళిక‌ను వెల్లడించింది.

లేఆఫ్స్‌ ఉద్యోగులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను సాగనంపాయి. తాజాగా వీడియో గేమింగ్ కంపెనీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫ్రాంఛైజీ మేక‌ర్.. టేక్ -టూ ఇంట‌రాక్టివ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ లే ఆఫ్స్ ప్రక‌టించింది. వ్యయ నియంత్రణ‌, కంపెనీ కార్యక‌లాపాల క్రమ‌బద్ధీక‌ర‌ణ‌లో భాగంగా భారీ పున‌ర్వ్యవ‌స్ధీక‌ర‌ణ ప్రణాళిక‌ను వెల్లడించింది. ఈ ప్రణాళిక‌ల‌లో భాగంగా కంపెనీ ఉద్యోగుల్లో 5 శాతం అంటే దాదాపు 600 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపుతోంది. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ప‌లు ప్రాజెక్టుల‌ను నిలిపివేసింది.

ఈ చ‌ర్యల‌తో కంపెనీకి ఏటా 165 మిలియ‌న్ డాల‌ర్లు ఆదా కానున్నాయి. టేక్ టూ ఇంట‌రాక్టివ్ సాఫ్ట్‌వేర్‌లో మార్చి 31, 2023 నాటికి ప్రపంచ‌వ్యాప్తంగా 11,580 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. టేక్‌-టూ 2023 మార్చిలోనూ ప‌లువురు ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించింది. త‌న ప్రైవేట్ డివిజ‌న్ ప‌బ్లిషింగ్ లేబుల్ స‌హా ఇత‌ర విభాగాల‌కు చెందిన ఉద్యోగుల‌పై వేటు వేసింది. ఇక టేక్ టూతో పాటు ఈ ఏడాది టెన్సెంట్‌కు చెందిన రియోట్ గేమ్స్‌, ఎల‌క్ట్రానిక్ ఆర్ట్స్‌, సోనీ స‌హా ప‌లు గేమింగ్ దిగ్గజాలు లేఆఫ్స్‌ ప్రకటించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!