Liquor Bath: వామ్మో..ఇవి మంగళ స్నానాలు కావు.. మద్యం స్నానాలు.! వీడియో.

|

Mar 23, 2024 | 11:21 AM

పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక. ఆలాంటి పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అదిరిపోయేలా జరుపుకుంటారు. ఇటీవల కాలంలో ఈ పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తమ పెళ్లి వేడుకు నూరేళ్లు గుర్తండిపోయేలా విచిత్ర పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక. ఆలాంటి పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అదిరిపోయేలా జరుపుకుంటారు. ఇటీవల కాలంలో ఈ పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తమ పెళ్లి వేడుకు నూరేళ్లు గుర్తండిపోయేలా విచిత్ర పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ యువకుడు తన పెళ్లి సందర్భంగా హల్దీ ఫంక్షన్ ను వెరైటీగా జరుపుకున్నాడు.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నరేందర్ కు వలిగొండ కు చెందిన ఓ యువతీతో పెళ్లి సంబంధం కుదిరింది. నరేందర్ తన పెళ్లి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. సాధారణంగా మంగళస్నానం పసుపు నీటితో చేస్తారు. వరుడి మంగళస్నానికి గులాబీ పూలు, రంగురంగుల ఫ్లవర్స్, డెకరేషన్స్ తో అదిరిపోయేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు నరేందర్ కు గులాబీ రెక్కలు కలిపిన పసుపు నీటితో మంగళ స్నానం చేయించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వరుడి మిత్రులు నానా హంగామా చేశారు. కల్లు, బీరు, విస్కీ బాటిల్స్ తో వినూత్నంగా వరుడిపై పోసి మద్యం స్నానం చేయించారు. అనంతరం మద్యం బాటిల్స్ తో డ్యాన్సులు, విన్యాసాలు చేశారు. ఈ తతంగం చేస్తున్న వరుడి మిత్రులను చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేశారు. వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదికయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తుండడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..