Funny Video: వరద నీటిలో వధువును వెతుక్కుంటూ వరుడు.. ఎక్కడ జరిగిందో కానీ.. చాలా ఫన్నీగా..

దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు, పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీటి మునిగిపోయాయి.. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి

Funny Video: వరద నీటిలో వధువును వెతుక్కుంటూ వరుడు.. ఎక్కడ జరిగిందో కానీ.. చాలా ఫన్నీగా..

|

Updated on: Aug 16, 2022 | 4:56 PM


దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు, పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీటి మునిగిపోయాయి.. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వివాహవేడుక జరుపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఊహించండి. తాజగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరదల కారణంగా ఓ గ్రామం మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఓ యువకుడు తన పెళ్లి కోసం వధువు చెంతకు ప్రయాణమయ్యాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ వరుడు మోకాళ్ల లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను నీటిలో పడిపోతాడేమోనని భయపడుతున్నాడు, అయితే ఓ వ్యక్తి వరుడిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అంతేకాదు వరుడు వెనుక మరికొందరు బంధువులు, అమ్మాయిలు, మహిళలు కూడా వరద నీటిలోకి దిగారు. వానొచ్చినా..వరదొచ్చినా వెనక్కి తగ్గేదేలేదంటూ ముందుకు కదిలారు. ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మేమంతా కలిసి మెలిసి అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోను ఆరు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించడమే కాదు లక్షల్లో లైకులు కురిపించారు. పలురకాల ఫన్నీ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us