Ayodhya: అయోధ్య రామమందిర నిర్మాణంలో తెలుగు రాష్ట్రాల పాత్ర ఇదే.! వివరాలు..

Updated on: Jan 22, 2024 | 10:21 AM

యావత్‌ భారతదేశంలోని హిందువుల కల కనులముందు సాక్షాత్కారమవుతోంది. అయోధ్యలో అసాధ్యం అనుకున్న భవ్య రామమందిరం సుసాధ్యమయింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా పునాదిరాయిపడింది. అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్భాలయం నిర్మాణం పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమిచ్చేందుకు రామ్‌లల్లా సిద్ధమయ్యాడు. కొన్ని గంటలలోనే ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అలయం ప్రారంభం కాబోతోంది.

యావత్‌ భారతదేశంలోని హిందువుల కల కనులముందు సాక్షాత్కారమవుతోంది. అయోధ్యలో అసాధ్యం అనుకున్న భవ్య రామమందిరం సుసాధ్యమయింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా పునాదిరాయిపడింది. అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్భాలయం నిర్మాణం పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమిచ్చేందుకు రామ్‌లల్లా సిద్ధమయ్యాడు. కొన్ని గంటలలోనే ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అలయం ప్రారంభం కాబోతోంది. ఒక తపస్సులా కొనసాగుతున్న ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎందరో కృషి ఉంది.. ఇంజనీర్లు దగ్గర్నుంచి కూలీల వరకూ రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న వారంతా ఎంత ధన్య జీవులు.. దేశం నలుమూలలననుంచి ఈ ఆలయనిర్మాణానికి అవసరమైన ముడి సరకును సేకరించి ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. మరి ఇందులో మన తెలుగు రాష్ట్రాలు, తెలుగువారి పాత్ర ఎంత?

కొన్ని నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని నిర్మాణాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తాయి. అయోధ్యలో నిర్మితమవుతున్న దివ్య భవ్య రామాలయం కనీసం వెయ్యేళ్ళు నిలిచేలా ఇనుము, సిమెంట్ ఉపయోగించకుండా నిర్మాణం జరుపుకుంటోంది. అలాంటి ఆ ఆలయ నిర్మాణంలో ఏయే వస్తువులు వినియోగించారు? దేశంలోని ఏఏ ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చారు? ఆలయ నిర్మాణంలో తెలుగు రాష్ట్రాల పాత్ర ఎంత? ఇలాంటి వివరాలన్నీ టీవీ9 కు వివరించారు ఆలయ నిర్మాణ సంస్థ L&T లో DGM గా పనిచేస్తూ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలుగు ఇంజనీర్ అయ్యలసోమయాజుల సూర్య శ్రీనివాస్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos