బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టగానే చాలామంది సరదాలను పక్కన పెట్టేస్తారు. శారీరకంగా, మానసికంగా కూడా బలహీనపడతారు. ఏ చిన్న పనికైనా ఇతరులపై ఆధారపడుతుంటారు. కానీ ఈ ఆలోచనలకే చెక్ పెడుతూ, ఓ బామ్మ తన జోష్‌ఫుల్ డ్యాన్స్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు యవ్వనంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రూవ్ చేసింది.
కజరారే పాటకు ఆ బామ్మ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వావ్ బామ్మ, వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. ఆ పాటలో బిగ్ బీ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఈ ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. అప్పుడే కాదు.. ఇప్పటికి ఈ సాంగ్ పండగలలో, ఫంక్షన్లలో, సంగీత్ కార్యక్రమాలలో తప్పనిసరిగా వినిపించే పాటగా నిలిచింది. ఈ పాటలోని ఎనర్జీ, స్టెప్పులు, మ్యూజిక్.. ఇవన్నీ కలసి ఈ సాంగ్‌ను ఎప్పటికీ మర్చిపోలేని హిట్‌గా మార్చేశాయి. అదే పాటకు తాజాగా ఆ వృద్ధ మహిళ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిరిక్స్‌కు తగినట్లుగా హవాభావాలను పలికిస్తూ అదిరిపోయే స్టెప్పులతో నెటిజన్లను ఫిదా చేసింది. ఆమె డ్యాన్స్ చూసినవాళ్లు ‘ఇది నిజంగా ఇన్‌స్పిరేషన్’, ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్!’ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ పాటకు 72 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: