Viral Video: స్కూటర్‌పై తిప్పిన తాత.. పైలట్‌గా విమానంలో తీసుకెళ్లిన మనవడు.! వీడియో.
కుమారుడు పెద్ద ఉద్యోగం చేస్తుంటే చూసి మురిసిపోవాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆరాటపడే కొడుకులూ ఉంటారు. అయితే, ఇలాంటి సందర్భాలు మాత్రం అరుదుగా ఉంటాయి. కుమారుడు నడిపే విమానమే ఎక్కిన ఆ తల్లిదండ్రులు ఊహించని విధంగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుమారుడు పెద్ద ఉద్యోగం చేస్తుంటే చూసి మురిసిపోవాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆరాటపడే కొడుకులూ ఉంటారు. అయితే, ఇలాంటి సందర్భాలు మాత్రం అరుదుగా ఉంటాయి. కుమారుడు నడిపే విమానమే ఎక్కిన ఆ తల్లిదండ్రులు ఊహించని విధంగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. అంతలోనే కేబిన్‌లోకి వచ్చిన పైలట్ ప్రదీప్ కృష్ణన్ చేసిన అనౌన్స్‌మెంట్ అందరినీ ఆశ్చర్యపరిస్తే, తల్లిదండ్రులను భావోద్వేగానికి గురిచేసింది. చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈ రోజు అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. మా తాత ఈ రోజు మొదటిసారి నాతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నోసార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయనను విమానంలో ఎక్కించుకున్నాను అని ప్రదీప్ పేర్కొన్నారు. కొడుకు తమ గురించి చెబుతుంటే ఆయన తల్లి ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తల్లి, తాత, బామ్మను ప్రదీప్ ప్రయాణికులకు పరిచయం చేయగానే వారంతా ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ఈ వీడియోను ప్రదీప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కుటుంబం, స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం ప్రతి ఒక్క పైలట్ కల అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చిన కుమారుడంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.