పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు

|

Aug 27, 2024 | 3:57 PM

వన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. నానా బీభత్సం చేస్తున్నాయి. పుణ్యక్షేత్రాలు, కళాశాలలు, ఆస్పత్రులూ ఏవీ వదలడం లేదు. ఎక్కడచూసినా జంతువుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ఉన్న బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని వంటశాలలోకి చొరబడి కోతులు ఎంచక్కా ఆరగించాయి.

వన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. నానా బీభత్సం చేస్తున్నాయి. పుణ్యక్షేత్రాలు, కళాశాలలు, ఆస్పత్రులూ ఏవీ వదలడం లేదు. ఎక్కడచూసినా జంతువుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ఉన్న బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని వంటశాలలోకి చొరబడి కోతులు ఎంచక్కా ఆరగించాయి. అది చూసిన విద్యార్ధులు షాకయ్యారు. కళాశాలలో వండిన వంటకాలకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో కోతులు దూరి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను కోతులు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెస్‌లో ఆహారం తినడానికి విద్యార్థులు భయపడుతున్నారు. అక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉందని తెలిసి కూడా వంట పూర్తిచేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఉంచడం లేదని, విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులు ఆహారం తింటున్న దృశ్యాలను విద్యార్ధులు వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపడంతో పిల్లల ఆరోగ్యంపై వారు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు

Explainer: సమంత పోస్ట్ లో ఇంత అర్థం ఉందా ??

Follow us on