ఆ స్కూలు మొత్తానికీ స్టూడెంట్‌ ఒక్కరే.. టీచర్ ఒక్కరే !!

|

Nov 02, 2024 | 9:10 AM

ప్రైవేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సర్కారు బడుల్లో మౌలిక వసతులు పెంచుతూ... విద్యనందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎందుకో ఇంకా చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఓ పాఠశాల...ఇప్పుడు కేవలం ఒక్క స్టూడెంట్‌తో నడుస్తోంది.

ఒకప్పుడు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో రానురాను విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి…. ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థికి.. ఒక టీచర్ ఉన్నారు. ఒకప్పుడు వందకు పైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం కుళ్లాయమ్మ ఒక్కటే విద్యార్థిని. ఒకటో తరగతి చదువుతున్న కుళ్లాయమ్మకు… అన్నీ తానే అయి టీచర్ నికిత చూసుకుంటున్నారు. టీచరైన, ఫ్రెండ్ అయినా ఆ ఉపాధ్యాయురాలే. విద్యార్థిని కుళ్లాయమ్మకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేక స్కూలుకు రాకపోయినా… టీచర్ నికిత కుళాయమ్మ ఇంటికి వెళ్లి క్షేమ సమాచారం కనుక్కుంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఇష్టపడలేదు. గుత్తి పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను జాయిన్ చేశారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో కేవలం 5వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన ఉండడంతో… ఆరవ తరగతి నుంచి మళ్లీ ప్రైవేటు స్కూల్లో చేర్పించడానికి వెళ్లాల్సిందేనని వాదిస్తున్నారు. అందుకే కాశేపల్లి గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకుండా ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. అలా వందకు మందిపైగా స్ట్రెంత్ ఉన్న కాసేపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఇప్పుడు కుళ్లాయమ్మ ఒక్కతే విద్యార్థిని. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కూడా అమలవుతోంది. మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ దక్కించుకున్న కాంట్రాక్టర్… ఇంటి వద్ద కుళ్లాయమ్మ కోసం భోజనం సిద్ధం చేసి పాఠశాలకు తీసుకొచ్చి వడ్డిస్తున్నారు..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??

కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ఊహించలేరు

Follow us on