గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం

Updated on: Aug 06, 2025 | 6:08 PM

అర్జెంటీనాలో గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం తీసిన నగ్న చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడంతో బాధితుడు పరువు నష్టం దావా వేశాడు. విచారణ జరిపిన న్యాయస్థానం.. గూగుల్ సంస్థ.. బాధితుడికి రూ. 10.81 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో బ్రగాడో అనే పోలీసు అధికారి ఇంటి పెరట్లో నగ్నంగా సన్‌బాతింగ్‌ చేస్తుండగా గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం ఫొటోలు తీసింది.

ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు నష్టం జరిగిందని ఆయన కోర్టును ఆశ్రయించారు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన హక్కులు ఎంత కీలకమో ఈ ఉదంతం తెలియజేసింది. 2017లో అర్జెంటీనాకు చెందిన పోలీసు అధికారి బ్రగాడో.. తన ఇంటి పెరట్లో సన్ బాతింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన నగ్నంగా ఉండగా.. గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వే వాహనం ఫొటోలు తీసుకుంటూ వెళ్తోంది. వీధుల ఫొటోలు మాత్రమే తీసినప్పటికీ.. అతడు పెరట్లో ఉండగా ఫొటోల్లో పడ్డాడు. ఆ విషయం గుర్తించని సిబ్బంది.. ఆ నగ్న చిత్రాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోలో అతడు మాత్రమే కాకుండా అతని ఇంటి నంబర్, వీధి పేరు కూడా స్పష్టంగా కనిపించాయి. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే టీవీ ఛానెళ్లలోనూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇలా బ్రూడో ఫొటో దేశ వ్యాప్తంగా తెగ వైరల్ అయిపోయింది. తన గోప్యత, వ్యక్తిగత ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయని భావించిన బ్రూడో గూగుల్‌పై న్యాయ పోరాటం ప్రారంభించారు. ముఖ్యంగా తన అనుమతి లేకుండా, తాను నగ్నంగా ఉన్న చిత్రాన్ని బహిరంగంగా ప్రచురించడం ద్వారా గూగుల్ తన గోప్యతకు భంగం కలిగించిందని వాదించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గూగుల్ గోప్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని నిర్ధారించి.. అతని ప్రైవసీ హక్కును ఉల్లంఘించినందుకు నష్ట పరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ సంస్థ అతడికి 12,500 డాలర్లను ఇవ్వాలని తీర్పునిచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు

ఏం సినిమా రా బాబూ.. రూ. 17,400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్

పన్ను చెల్లింపుదారులకు అదిరేపోయే శుభవార్త

KohiNoor: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

భార్యాభర్తల కోసం బెస్ట్‌ పోస్టాఫీస్‌ సేవింగ్స్ స్కీమ్‌..! రూ.13 లక్షలు మీ సొంతం