గూగుల్ డాట్‌ కాం కొన్న గుజరాతీ..! ఎంతకంటే ??

Updated on: May 01, 2025 | 4:21 PM

ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా ఠక్కున గుర్తుకొచ్చేది గూగుల్ డాట్‌ కాం. ఒక్క క్లిక్ లో సమస్త సమాచారాన్ని అందించే గూగుల్ను లారీపేజ్, సెర్గీ బ్రిన్ సొంతం. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ సెర్చింజన్ను ఓ సాధారణ వ్యక్తి కొన్నారు. అది కూడా ఓ పిజ్జా కొనేందుకు ఖర్చుపెట్టేంత డబ్బులతో. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది నిజం.

2015లో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి నిజంగానే గూగుల్ డాట్ కాంను కొన్నారు. ఇంతకీ అది ఎలా సాధ్యమైంది..? గూగుల్ ఏం చేసింది? అసలు ఆ కహానీ ఏంటి..? గుజరాత్ కు చెందిన సన్మయ్ వేద్ గూగుల్ మాజీ ఉద్యోగి. 2015లో ఓ రోజు రాత్రి నిద్రపట్టకపోవడంతో సరదాగా డొమైన్లు చెక్ చేస్తున్నాడు. అప్పుడే ఓ అద్బుతం అతని కంటపడింది. ఊరికే చూద్దామని గూగుల్‌ డాట్ కామ్‌ను ఎంటర్‌ చేస్తే ఆ డొమైన్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. మొదట నమ్మలేకపోయినా ఆ తర్వాత దాన్ని షాపింగ్ కార్ట్‌లో యాడ్ చేశాడు. నిజానికి అమ్మకానికి ఉన్న డొమైన్‌ పేర్లు మాత్రమే కార్ట్‌ లో యాడ్ అవుతాయి. గూగుల్ డాట్ కాం తన కార్ట్ లో యాడ్ కావడంతో వెంటనే దాన్ని కొనేందుకు రెడీ అయ్యాడు. గూగుల్ డాట్ కామ్ డొమైన్ కేవలం 12 డాలర్లకే అందుబాటులో ఉండటంతో క్రెడిట్ కార్డు ఉపయోగించింది దాన్ని కొనేశాడు. అయితే అప్పటికీ సన్మయ్ కు నమ్మకం కుదరలేదు. పేమెంట్ ఫెయిల్ అవుతుందని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ ఫుల్ అయింది. అప్పటి లెక్క ప్రకారం కేవలం 815 రూపాయలకే గూగుల్ డాట్ కాం సన్మయ్ సొంతమైంది. గూగుల్‌ వెబ్‌మాస్టర్‌ టూల్స్‌ అన్నీ యాక్సెస్‌ చేయగలిగాడు. అయితే ఆ ఆనందం కొద్ది క్షణాలకే ఆవిరైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!

సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!

ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌