Shamshabad Airport : పైకేమో సెంట్‌‌బాటిల్స్, ఆటబొమ్మలు.. లోపల చూస్తే షాక్..! ఇలా కూడా చేయొచ్చా..!

|

May 02, 2023 | 8:45 AM

అక్రమ బంగారం రవాణాకు కేరాఫ్​ అడ్రస్​గా హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయం మారుతోంది. అత్యధికంగా గోల్డ్​ను ఇక్కడికే తరలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిసినా సరే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోని మరి నగరంలోకి తీసుకువస్తున్నారు మాయగాళ్లు.

అక్రమ బంగారం రవాణాకు కేరాఫ్​ అడ్రస్​గా హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయం మారుతోంది. అత్యధికంగా గోల్డ్​ను ఇక్కడికే తరలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిసినా సరే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోని మరి నగరంలోకి తీసుకువస్తున్నారు మాయగాళ్లు. తాజాగా ఎయిర్​పోర్టులో దాదాపు కిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ.. ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్​అధికారులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొని.. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.దుబాయ్​ నుంచి ఉదయం ఒక ప్రయాణికుడు, సాయంత్రం ఒక మహిళా ప్రయాణికురాలు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వచ్చారు. ఇరువురిపై కస్టమ్స్​అధికారులకు అనుమానం వచ్చి.. వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనితో వారి వద్ద ఉన్న వివిధ వస్తువుల్లో 59 లక్షల 27వేల రూపాయల విలువైన 953 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు గుర్తించారు. వాటిని చూసిన ఎయిర్​ పోర్టు అధికారులే ఆశ్చర్యానికి గురైయ్యారు.ఎందుకంటే ఎయిర్​పాడ్స్​, పిల్లల బట్టల గుండీలు, అట్టపెట్టె మధ్యలో, పర్​ఫ్యూమ్​ బాటిల్స్​ మూతల్లో, లేడీస్​ హ్యాండ్​ బ్యాగ్​ వంటి వస్తువుల్లో ఎవరికి అనుమానం రాకుండా బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. ఎవరి కంటా పడకుండా గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని చూశారు. ఇందుకు సంబంధించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Follow us on