ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు
సాధారణంగా ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నయా?’ అనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే..చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో గానీ.. అక్కడి చెట్లకు మాత్రం బంగారం కాస్తుందట. యస్ మీరు విన్నది నిజమే.. ఒకరకమైన చెట్టు ఆకుల నుంచి బంగారం తీయొచ్చని ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెట్లలో ఈ సహజ ప్రక్రియను కనుగొన్నారు.
సూదుల్లా ఉండే.. నార్వే స్ప్రూస్ చెట్ల ఆకుల్లో అత్యంత సూక్ష్మమైన బంగారం కణాలు ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చెట్లలోని సూక్ష్మజీవుల చర్యల మూలంగా సహజసిద్ధంగా వాటిలో బంగారం ఉత్పత్తి అవుతున్నదని వారు నిర్ధారించారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ తరుణంలో బయటికొచ్చిన ఈ వార్త పసిడి ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నార్వే స్ప్రూస్ చెట్లలో విభిన్న రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి. పీ3ఓబీ-42, క్యుటిబ్యాక్టీరియమ్, కొరినెబ్యాక్టీరియం వంటి బ్యాక్టీరియా ఈ చెట్లలో పుష్కలంగా ఉన్నట్లు డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌లో తెలిసింది. సూదిగా ఉండే ఆకులు చిన్న ప్రయోగశాలగా పని చేస్తాయి. మట్టి నుంచి ద్రవ రూపంలోని బంగారం చెట్ల వేళ్ల ద్వారా ప్రయాణించి, ఆకుల సూదుల్లోకి చేరుతుంది. సూక్ష్మజీవులు ఈ ఆకుల సూదుల్లో బయోఫిలిం వంటి పొరను సృష్టిస్తాయి. ఈ ద్రవ రూపంలోని బంగారం ఈ ఆకుల సూదుల్లోకి చేరి, ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుందని శాస్త్రవేత్తలంటున్నారు.నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని స్ప్రూస్ చెట్లకు మాత్రమే బంగారం పండుతుందట. ప్రస్తుతం బంగార గనుల తవ్వకాల ద్వారా పర్యావరణానికి నష్టం జరుగుతున్నది. బంగారం ఉత్పత్తికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయో శాస్త్రవేత్తలు గుర్తించగలిగితే, చెట్లు సహజ బయలాజికల్ ఇండికేటర్స్‌గా ఉపయోగపడతాయి. ఫలితంగా బంగారం కోసం అన్వేషణ డ్రిల్లింగ్ నుంచి సూక్ష్మజీవులు, చెట్ల బయోమ్యాపింగ్‌కు మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇతర చెట్లకు, లోహాలకు కూడా వర్తిస్తుందా? అనే అంశం భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో తేలనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి
Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..
మీ కూతురు జైల్లో ఉంది.. ఫేక్ కాల్‌ను తిప్పికొట్టిన తండ్రి
సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??
