సగానికి తగ్గనున్న బంగారం ధరలు? వీడియో

Updated on: Oct 05, 2025 | 3:57 PM

ప్రస్తుతం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు సగానికి తగ్గుతాయని మార్కెట్ నిపుణుడు స్మిత్ థక్కర్ అంచనా వేశారు. గోల్డ్ రేట్లు ఏకంగా 44 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీపావళికి ముందు ఈ భారీ తగ్గింపు సాధ్యపడవచ్చని విశ్లేషించారు. మారుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ధరల తగ్గుదలకు కారణాలుగా పేర్కొన్నారు.

బంగారం కేవలం ఆర్థిక భద్రతకే కాకుండా సామాజిక హోదాకు చిహ్నంగా కూడా ఉంది. అలంకరణతో పాటు పెట్టుబడికి కూడా ఇది ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంది. ఇటీవలి కాలంలో బంగారం డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఒక తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే, ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని, బంగారం ధర భారీగా తగ్గి, ప్రస్తుత ధరలో సగానికి లభిస్తుందని మార్కెట్ నిపుణుడు స్మిత్ థక్కర్ అంచనా వేశారు. గోల్డ్ రేట్లు ఏకంగా 44 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని థక్కర్ సూచించారు. ఈ తగ్గుదల ఎప్పుడు సాధ్యమనేది ఖచ్చితంగా చెప్పకపోయినా, దీపావళికి ముందు ఈ భారీ తగ్గింపు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో