యానాం వద్ద దొరికిన తొలి పులస.. ధర తెలిస్తే షాకే..

Updated on: Jul 20, 2025 | 5:59 PM

పుస్తెలు అమ్మి అయినా పులస తినాలనేది నానుడి. చేపలు ఇష్టపడే వారికైతే.. ఈ పులస పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల నుంచి సముద్రంలో ఈదుకుంటూ వచ్చే ఈ చేపలు గోదావరిలో వరదనీటికి ఎదురీదుతూ తమ రంగు, స్వభావం, రూపాలను మార్చుకుంటాయి. దీనివల్లనే ఈ చేపలకు ఇంత రుచి అంటారు.

అందుకే ఎంత ఖరీదైనా కొనడానికి సిద్ధపడతారు. ఇక.. నైరుతి ఎఫెక్ట్‌తో ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతుండటంతో పులసల సందడి కూడా మొదలైంది. యానాంలో ఈ ఏడాది తొలి పులస మత్స్యకారుల వలకు చిక్కింది. యానాం గోదావరిలో మత్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను మత్స్యకారులు వేలం వేశారు. దానిని మత్స్యకార మహిళ పోన్నమండ రత్నం రూ. 18 వేలు పెట్టి కొన్నారు. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయని, గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఈ చేపలు అందులో ఎదురీదటం వల్లనే దీనికి అంతరుచి అని మత్యకారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు పడుతున్నాయని, వచ్చే రెండు నెలల్లోనూ పులసలు విరివిగా దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్యకారులు.ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరున్నా.. ఏటికేడు వాటి లభ్యత తగ్గిపోతోందని వారు తెలిపారు. గతంలో గోదావరి జిల్లాలో ఏడాదికి సగటున 3 టన్నుల పులసలు దొరికేవని, ఇప్పుడు అది రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయిందని వారు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

తాయత్తులు, రాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తి