జాలర్ల వలలో డూమ్స్‌ చేప.. ప్రకృతి విపత్తు తప్పదా

Updated on: Oct 14, 2025 | 8:57 PM

ఇటీవల చెన్నై రామేశ్వరంలోని కొందరు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. వారి వలలో డూమ్స్‌ చేపలు చిక్కాయి. అవి 10 కిలోల బరువు, ఐదు అడుగుల పొడవుతో ఉన్నాయి. పాంబన్‌ మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతం నుంచి వేటకు వెళ్లిన జాలర్ల వలలో ‘డూమ్స్‌డే’ రకం చేపలు చిక్కాయి. వీటిపై మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. ఈ జాతి చేపలు పొడవుగా, కండగలిగి ఉంటాయని, నారింజ రంగు రెక్కలతో, చారల శరీరంతో చూపరులను ఆకట్టుకుంటాయని తెలిపారు.

డూమ్స్‌డే ఫిష్ నిజానికి ఓర్ ఫిష్ అనే లోతైన సముద్ర చేప. ఇది ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, సునామీలకు సంకేతమని అంటుంటారు. ఈ చేప ఒడ్డుకు కొట్టుకొస్తే విపత్తు సంభవిస్తుందని జపాన్‌ సహా పలు ఆసియా దేశాల్లోని మత్స్యకారులు నమ్ముతారు. అందుకే వీటికి ‘డూమ్స్‌డే’ అనే పేరు వచ్చింది. కానీ, అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు’ అని వివరించారు. ఇది చాలా అరుదుగా ఉపరితలం దగ్గర కనిపిస్తుందని, అటువంటి చేప తమిళనాడులోని పాంబన్ సమీపంలో మత్స్యకారుల వలలో చిక్కడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ఫోన్‌ కాల్‌తో ఆమె కోట్లకు పడగెత్తింది

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్

ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..

విద్యార్ధులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

సల్మాన్‌తో దిల్ రాజు బిగ్‌ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్ ఎవరో తెలుసా