Dumbo Octopus: ఏనుగు చెవులున్న ఆక్టోపస్.. వైరల్ అవుతున్న ఏనుగు చెవుల జీవి వీడియో.
సముద్రపు లోతుల్లో చిత్రవిచిత్రమైన జీవరాశులు నివసిస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలను సముద్రం చాలాసార్లు పరిచయం చేసింది. ఇటీవలే వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించి సదరు ఫొటోగ్రాఫర్ అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా పసిఫిక్ సముద్రం లోతుల్లో ఓ వింత జీవి కన్పించింది. ప్రస్తుతం దాని వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సముద్రపు లోతుల్లో చిత్రవిచిత్రమైన జీవరాశులు నివసిస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలను సముద్రం చాలాసార్లు పరిచయం చేసింది. ఇటీవలే వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించి సదరు ఫొటోగ్రాఫర్ అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా పసిఫిక్ సముద్రం లోతుల్లో ఓ వింత జీవి కన్పించింది. ప్రస్తుతం దాని వీడియో నెట్టింట వైరల్గా మారింది. నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్ కనిపించింది. ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ వాహనంలోని డీప్ సీ కెమెరా ఈ ఆక్టోపస్ వీడియో తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్ దాదాపు 7 కిలోమీటర్ల లోతులో నివసిస్తోంది. ఈ ఆక్టోపస్ డంబో కు ఏనుగు చెవుల్లా భారీ రెక్కలున్నాయి. ప్రపంచంలోనే వీటిని అందమైన ఆక్టోపస్‌లు అంటారట. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో ఇది కదులుతుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియోని ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..