క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
క్రిస్మస్ సెలవులను ఆసరాగా చేసుకుని జర్మనీలోని స్పార్కాస్కై బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. దొంగలు భూగర్భ గ్యారేజ్ నుంచి వాల్ట్‌కు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. రెండు రోజులు బ్యాంకులోనే ఉండి రూ. 316 కోట్ల విలువైన బంగారం, నగదును అపహరించారు. 3000కు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను పగులగొట్టి, కస్టమర్లలో తీవ్ర ఆందోళన కలిగించారు.
క్రిస్మస్ సెలవుల కోసం మూసి ఉన్న బ్యాంకును దొంగలు లూటీ చేసి రూ. 316 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్‌కు డ్రిల్‌తో రంధ్రం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. రెండు రోజులు బ్యాంకులోనే ఉండి లాకర్లలోని క్యాష్, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. జర్మనీలోని స్పార్కాస్కై బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారే. గ్యారేజ్ నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్‌కు డ్రిల్‌తో రంధ్రం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. మూడు వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను పగులగొట్టి, అందులోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం ఫైర్ అలారం మోగడంతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. శని, ఆదివారాలు రాత్రి సమయంలో గ్యారేజీ మెట్ల వద్ద కొందరు వ్యక్తులు పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్లడం చూశామని సాక్షులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. బ్యాంకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సోమవారం ఉదయం మాస్క్‌లు ధరించి వ్యక్తులు బ్లాక్ కలర్ ఆడి కారులో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. క్రిస్మస్ సెలవులను అదునుగా చేసుకుని దొంగలు బ్యాంకును లూటీ చేశారని పోలీసులు తెలిపారు. సెలవు ఉన్న రెండు రోజులు దొంగలు బ్యాంకులోనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95 శాతం వరకు దోపిడీకి గురైనట్లుగా బ్యాంకు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు పరిమితి విలువ 10,300 యూరోలు అని తెలిపారు. దీంతో మొత్తం నష్టాన్ని సుమారు 30 మిలియన్ యూరోలు అంటే రూ. 316 కోట్లుగా అంచనా వేసారు. బ్యాంకులో దోపిడీ జరిగిందన్న వార్త తెలిసి కష్టమర్లు కంగారుపడ్డారు. పెద్ద సంఖ్యలో బ్యాంక్‌కు చేరుకుని నిరసన చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకును మూసేసారు. కస్టమర్ల ఆందోళనతో హాట్ లైన్ ఏర్పాటు చేసి, బీమా కంపెనీతో కలిసి క్లైయిమ్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. కస్టమర్లకు అండగా ఉంటామని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
నో వెయిటింగ్.. నో పుషింగ్.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్ సక్సెస్
ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల హంగామా
