Kothagudem: రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేద్దామని వెళ్లిన యువకులు.. కట్ చేస్తే

| Edited By: Ram Naramaneni

Sep 15, 2024 | 12:12 PM

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు. పోలీసుల నిఘాను తప్పించుకోవటానికి గంజాయి స్మగ్లర్లు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. హైదరాబాద్‌..వరంగల్‌ .. ఇలా ఒక చోట అని కాదు.. జిల్లా జిల్లాలో పల్లెపల్లెలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది.

కొత్తగూడెంలో పుష్పను తలపించేలా గంజాయి రవాణా చేస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు కేటుగాళ్లు. అంబులెన్స్ లో తరలిస్తున్న సుమారు 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు. వారిని గోప్యంగా విచారిస్తున్నారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.  పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు.
పుష్పా సినిమా సీన్లను తలదన్నేలా ఖతర్నాక్ ప్లాన్లు వేస్తూ చివరికి దొరుకుతున్నారు. ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తుండగా..  మార్గమధ్యంలో కొత్తగూడెం వద్ద అంబులెన్స్‌కు టైర్ పంక్చర్ అయ్యింది.  అంబులెన్స్ డ్రైవర్ సాయం కోరడంతో టైర్ మార్చేందుకు స్థానిక యువత సాయం చేశారు. లోపల పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో..  అనుమానంతో ఓ యువకుడు అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయగా ప్యాకింగ్ చేసిన గంజాయ్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో ఆ యువకులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు.   వెంటనే టూ టౌన్ పోలీసులు అర్థరాత్రి అక్కడకు చేరుకొని అంబులెన్స్‌ను తనిఖీ చేశారు.  గంజాయి బయట పడటంతో స్వాదీనం చేసుకున్నారు.  వాహనాన్ని సీజ్ చేసి నిందితులను విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Follow us on