Mahanandi: లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఎన్నో అద్భుతాలకు నిలయం. వాటిలో ఇక్కడి కోనేరు ఒకటి. ఈ కోనేరులో కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. కార్తీకమాసం పురస్కరించుకొని ఆలయ కోనేటికి గంగా హారతి నిర్వహించారు. ఈ క్రమంలో కోనేరులో నీటి స్వచ్చత మరోసారి రుజువైంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది.
ఈ కోనేరును రుద్రగుండం అని పిలుస్తారు. ఎంతో స్వచ్ఛంగా ఉండే ఈకోనేటి నీటిలో అలయ గోపురాలు ప్రతిబింబాలు ఎంతో స్పష్టంగా కనపడ్డాయి. అద్దంలో కనబడుతున్నట్టుగా ఉన్న ఆ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కోనేరు విశిష్ఠతను తెలియజేసిన ఆలయ అధికారులు ఈ కోనేరులో ఒక చిన్న గుండుసూది పడినా ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ క్షేత్రంలో ఎండాకాలం అయిన వాన కాలం అయిన ఏ కాలం అయిన నీటి ప్రవాహం ఒకే విధంగా వుండటం ఇక్కడ విశేషం. అందుకే ఈ ఆలయంకు తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం, ఇక్కడి కోనేరు గురించి స్కందపురణాంలో ఉందనీ, ఈ క్షేత్రంలోని నీరు ఐదుధారలుగా నిత్యం ప్రవహిస్తూ ఉంటుందని స్కందపురాణం,శివ పురాణంలో చెప్పినట్లు ప్రదాన అర్చకులు చెబుతున్నారు. క్షేత్రంలోని కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.