గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

Updated on: Sep 26, 2025 | 6:36 PM

భారత్‌లోని అనేక జీవనదులు హిమాలయాల్లో పుట్టాయి. ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయాల్లోని మంచు కరిగి నదులుగా మారి ప్రవహిస్తాయి. బ్రహ్మపుత్ర, గంగా, సింధు వంటి నదులన్నీ హిమాలయాల్లో పుట్టిన జీవనదులే . అయితే.. హిమాలయాల్లోని.. హిమానీనదాలు అంటే గ్లేసియర్లు కరిగిపోతే ఈ నదులు అంతరించిపోతాయా? అంటే గ్లేసియర్లు కరిగినా నదులు అంతరించిపోయే ప్రసక్తే లేదని నదుల ప్రవాహానికి 95% వర్షపాతం దోహదపడుతుందని గతంలో పరిశోధకులు ప్రకటించారు.

గంగా, బ్రహ్మపుత్ర,సింధు నదుల జలాలకు, హిమాలయలు కరిగిపోవడానికి ఎటువంటి సంబంధంలేదని వారు గతంలో నిర్ధారించారు. అయితే, ప్రస్తుతం గంగా నది ఎండిపోతున్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తెలిసింది. దీని ఫలితంగా కోట్ల మంది ప్రజలకు ఆహార, నీటి ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1,300 సంవత్సరాల గణాంకాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. గత వెయ్యి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 1991 నుంచి 2020 మధ్య కాలంలో గంగా నదీ పరీవాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. జూన్‌-సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించిన నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం తగ్గిపోవడమే ఈ పరిస్థితులకు కారణమని ఈ అధ్యయనం చేపట్టిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గాంధీనగర్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనాలకు చెందిన పరిశోధకులు తెలిపారు. 1990ల్లో గంగా పరీవాహక ప్రాంతాల్లోని దుర్భిక్ష పరిస్థితులు 16వ శతాబ్దంలో సంభవించిన కరువుతో పోల్చితే 76 శాతం తీవ్రమైనవని పరిశోధకులు అన్నారు. 1951-2020 మధ్యకాలంలో దేశ వార్షిక వర్షపాతంలో 9.5 శాతం తగ్గుదల నమోదైందని, అందులోనూ దేశ పశ్చిమ ప్రాంతంలో తగ్గుదల 30 శాతానికిపైగా ఉందని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం పెరగడం, హిమానీనదాలు కరగటం వల్ల గంగా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని మునుపటి అధ్యయనాలు అంచనా వేసినా.. వేడి పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో నీటి లభ్యతపై అంచనాలు సంక్లిష్టంగా ఉంటాయని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం

తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..

ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా

ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా

స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన