Viral video: ఓర్నీ దుంపతెగ..! మీరెక్కడ దొరికారు రా బాబు.. గణపతి చేతిలో లడ్డూను కూడా వదలడం లేదుగా..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొలువుదీరిన మండపాల్లో గణపతి ప్రత్యేక పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొలువుదీరిన మండపాల్లో గణపతి ప్రత్యేక పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన చేతిలో పెట్టే లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గణపతితో పాటు.. లడ్డుకూడా నవరాత్రులలో భక్తులతో పూజలను అందుకుంటుంది. భక్తులు చవితి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు, మంచి తరుణం మించిన రాదంటూ గణేష్ మండపంపై ఓ కన్నీసి ఉంచారు. నంద్యాల టుటౌన్ సమీపంలో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి.. భారీ గణపతి ప్రతిమకు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా వినాయకుడి చేతిలో లడ్డూను ఉంచారు. ఈ లడ్డూని నవరాత్రుల అనంతరం.. వేలం పాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఇద్దరు యువకులు అర్ధరాత్రి బైక్ మీద మండపం దగ్గరకు వచ్చారు. వారిలో ఒక యువకుడు.. గణపతి దగ్గరకు వెళ్లి.. లడ్డుని తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos