Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన..

|

Jan 18, 2024 | 7:24 PM

భక్తులు ప్రేమగా అప్పన్నగా పిలుచుకునే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కనుమ పండుగ అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టం స్వామివారి మకర వేట.. ఈ కార్యక్రమంలో గజేంద్రమోక్షం పేరుతో తారాజువ్వలు కాల్చడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా కాల్చిన తారాజువ్వలు మూడు సార్లు ముందుకు వెళ్లి వెనక్కి రావడంతో భక్తులంతా ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.

భక్తులు ప్రేమగా అప్పన్నగా పిలుచుకునే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కనుమ పండుగ అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టం స్వామివారి మకర వేట.. ఈ కార్యక్రమంలో గజేంద్రమోక్షం పేరుతో తారాజువ్వలు కాల్చడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా కాల్చిన తారాజువ్వలు మూడు సార్లు ముందుకు వెళ్లి వెనక్కి రావడంతో భక్తులంతా ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. అలా తారాజువ్వలు ముందుకు వెళ్ళి వెనక్కు వస్తే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని స్థానిక ప్రజలు, రైతులు నమ్ముతారు. శ్రీ వరహాలక్ష్మీ దేవస్థానం సన్నిధిలో జరిగే ఉత్సవాల్లో ఒకటైన గజేంద్రమోక్షం కనుమ పండుగ రోజున జరుగుతుంది. అంటే మకర వేట కోసం స్వామివారు కొండ పైన బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలి పవంచా వద్ద నుండి పైడితల్లి అమ్మవారి గుడి వరకు, అక్కడ నుండి స్వామి వారి పూల తోటకు మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో వేంచేసారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్

బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే

HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్

Saindhav: హాలీవుడ్‌ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్