పండ్ల మీద స్టిక్కర్లు.. వాటిపై నంబర్లు.. దేనికి ??

Updated on: Nov 04, 2025 | 6:58 PM

మనం బజార్లో యాపిల్స్‌, నారింజ, కివీ లాంటి పండ్లు కొనేటప్పుడు వాటిమీద చిన్న చిన్న స్టిక్కర్లు అంటించి ఉండడం చూస్తుంటాం. వీటిని పండ్ల మీద ఎందుకు అంటిస్తారో తెలుసుకుందాం. ఈ స్టిక్కర్ల మీద PLU కోడ్‌ రాసి ఉంటుంది. వీటి ద్వారా పండ్లను సాగు చేసిన విధానం అంటే వాటిని సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించారా, రసాయనాలు ఉపయోగించారా, జన్యుపరంగా మార్పులు చేసి ఉత్పత్తి చేశారా అనే సమాచారం తెలుసుకోవచ్చు.

పండ్ల నాణ్యతను అంచనా వేయవచ్చు. పీఎల్‌యూ కోడ్‌లో నాలుగు లేదా అయిదు నంబర్లు ఉంటాయి. స్టిక్కర్‌ మీద తొమ్మిదితో మొదలై అయిదు అంకెలు ఉంటే ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ విధానంలో పండించారని అర్థం. పంటలో ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు ఉపయోగించలేదని గుర్తించాలి. ఈ పండ్లను ఒకసారి మంచినీళ్లతో కడిగి తినవచ్చు. ఆరోగ్యానికి మంచివి. స్టిక్కర్‌ మీద నాలుగు అంకెలు మాత్రమే ఉంటే ఆ పండ్లను పండించేటప్పుడు రసాయనాలు, ఇతర పురుగుమందులు ఉపయోగించారని అర్థం. వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. వీటిని తినేముందు ఉప్పు నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి రెండు మూడుసార్లు శుభ్రంగా కడగాలి. స్టిక్కర్‌ మీద ఎనిమిదితో ప్రారంభమై అయిదు అంకెలు ఉంటే ఆ పండ్లను జన్యుపరంగా మార్పు చేశారని అర్థం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బంగారం రేటు తగ్గింది.. ఇవాళ తులం ఎంతంటే ??

Earth Quake: విశాఖలో భూప్రకంపనలు..భయంతో జనం పరుగులు

Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే

Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌‌పై అల్లు అర్జున్ ఎమోషనల్