ఇతని ఐడియాకు స్టన్ అయిపోయిన ఆనంద్ మహింద్రా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫన్నీ వీడియోలు, చిత్రాలను పంచుకుంటూ ఉంటారు.
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫన్నీ వీడియోలు, చిత్రాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ జుగాడ్ వీడియో ను నెట్టింట్లో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చూపించిన వస్తువు సహాయంతో ఎత్తయిన చెట్లనుంచి పండ్లను ఎంతో సులభంగా కోసుకోవచ్చు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే… ఇంట్లో ఎందుకూ పనికిరావని బయట పడేసే వస్తువులతో అద్భుతమైన పరికరాన్ని తయారు చేశారు. ఒక వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ పైపు, తాడును ఉపయోగించి దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. దాని సహాయంతో అతను చెట్టుపై ఉన్న పండ్లను సులభంగా కోస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ‘ఈ జుగాడ్ భూమికి ఏ విధంగానూ హాని కలిగించదు. ఇలాంటి ప్రయోగాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈ ఆవిష్కరణ గురించి నేను చాలా సంతోషిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేరుకే గ్రామం.. అక్కడ ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే !!
నాసా అద్భుత వీడియో !! మేఘాల గుండా వెళ్తోన్న గురు గ్రహం !!
Viral Video: పాములే అతడి నేస్తాలు.. నిద్రపోయినా వాటితో కలిసే !!