Leopard-Dog Viral Video: చిరుతను పరుగులు పెట్టించిన వీధి కుక్క.. వినడానికి విచిత్రంగా ఉన్న వీడియో చుస్తే మీరు అవునాల్సిందే..

|

Feb 25, 2022 | 9:25 AM

Leopard-Dog Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది.


Leopard-Dog Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది. కుక్క అరుపులకు చిరుత తోక ముడిచి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 16 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైకులతో హోరెత్తిస్తున్నారు. అసలేం జరిగిందంటే… రోడ్డు పక్కన కూర్చున్న ఓ కుక్కపై చిరుత దాడి చేయబోయింది. వెంటనే కుక్క లేచి నిలబడి చిరుతపై రివర్స్‌ అటాక్‌ చేసింది… పంటి కాటుతో కాదు.. నోటి అరుపుతో చంపేస్తా… అన్నట్టు ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లే వరకు కుక్క ఆరుస్తూనే ఉంది. ఈ కుక్క అరుపులకు భయపడిన చిరుతపులి తోకముడిచి వెళ్లిపోయింది. ధైర్యం ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చని ఈ వీడియో చెబుతోందంటున్నారు నెటిజన్లు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..