AP News: పేదలకు కడుపునిండా తిన్నంత నాన్ వెజ్ భోజనం.. ఎక్కడంటే..?

AP News: పేదలకు కడుపునిండా తిన్నంత నాన్ వెజ్ భోజనం.. ఎక్కడంటే..?

Ram Naramaneni

|

Updated on: Aug 27, 2023 | 7:55 PM

వారం ఆరు రోజులు మాత్రమే అటు అన్నా క్యాంటీన్, ఇటు రాజన్న క్యాంటీన్‌లో భోజనం పెడుతున్నారు. సండే మాత్రం పేదలకు ఆకలి వేయదా..? అందుకే .. ఆదివారం కూడా పేదలకు నాన్ వెజ్ భోజనం పెట్టాలని ఫిక్సయ్యాడు జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి చిన్నా. ఒక్కో వారం ఒక్కో నాన్ వెజ్ వైరైటీతో భోజనం పెడతామని తెలిపారు. మరి ఎప్పటివరకు ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తారని అడిగితే.. ఆయన ఏం చెప్పారంటే...

సండే రోజు ముక్క తినాలని ఎవరికి ఉండదు చెప్పండి… కానీ కొంతమంది పేదలకు ఆ స్థోమత కూడా ఉండదు. అందుకే తన ప్రాంత పేద ప్రజలకు ఆదివారం కడుపునిండా మాంసాహార భోజనం పెడుతున్నారు జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్నా. దీంతో ఈ మాంసాహార భోజనం కోసం ప్రజలు క్యూ కట్టారు. వందల సంఖ్యలో వచ్చి భోజనం చేసి వెళ్లారు. అయితే ఇప్పటికే జగ్గయ్యపేటలో 400 రోజులుగా టీడీపీ అన్నా క్యాంటిన్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ అన్నదానం చేస్తున్నారు మాజీ MLA శ్రీరాం తాతయ్య. అటు  గత 25 రోజుల నుంచి.. స్థానిక శాసనసభ్యుడు,  ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రాజన్న ఉచిత భోజనం పేరుతో అన్నదానం చేస్తున్నారు. ఐతే ఇరు పార్టీల నేతలు ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమాలు ఆదివారం మాత్రం బంద్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సైతం పేదవారికి నాన్ వెజ్ భోజనం పెట్టేందుకు ముందుకు వచ్చారు ఇంటూరి చిన్నా.  చికెన్ తో పాటు ప్రతి ఆదివారం ఒక్కో వెరైటీ నాన్ వెజ్ అన్నదానంలో ఏర్పాటు చేస్తున్నాడు.  ఫిష్, మటన్, బోటి లాంటి ఐటమ్స్ లిస్ట్‌లో ఉన్నాయి.  తనకు స్థోమత ఉన్నంత వరకు ఒక ఏడాది వరకు మాంసాహార ఉచిత భోజనం పేదలకు పెడతాను చెబుతున్నాడు ఇంటూరి చిన్నా. కాగా ఈ క్యాంటీన్‌ను ఆయన తన ఇంటి వద్దే నిర్వహిస్తున్నారు.

Published on: Aug 27, 2023 07:49 PM