యువతకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్..
యువత కోసం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన బహుమతిని ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశంలో ఉచితంగా కండోమ్స్‌ను అందిస్తామని చెప్పారు.
యువత కోసం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన బహుమతిని ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశంలో ఉచితంగా కండోమ్స్‌ను అందిస్తామని చెప్పారు. 25 సంవత్సరాల్లోపు యువతీ యువకులు కండోమ్స్‌ను ఉచితంగా అందించాలని ఫార్మసీలను ఆదేశించారు. అయితే, వినడానికే కొంత వింతగా ఉన్నా ఇది నిజమే. కండోమ్స్‌ను ఉచితంగా పంపిణీ చేయాలనే ఆదేశాల వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటంటే.. ఫ్రాన్స్ యువత ఎక్కువగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారట. ఫలితంగా అవాంఛిత గర్భధారణల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో నియంత్రణ కోసం ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఈ అవాంఛిత గర్భాలను తగ్గించేందుకు ఉచితంగా కండోమ్స్ అందజేయాలని ఆదేశించారు. 2020-21 మధ్య ఫ్రాన్స్‌లో లైంగిక వ్యాధుల సంక్రమణ రేటు 30శాతం పెరిగాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి గర్భనిరోధక మాత్రలు, గర్భసంచి లోపలే గర్భనిరోధక లూపులు, గర్భనిరోధక ప్యాచ్‌లు, ఇతర దీర్ఘకాలిక గర్భనిరోధకాలు ఉచితంగా అందిస్తూ వస్తోంది. అయితే, ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్యుల సూచన మేరకు కండోమ్స్ విక్రయాలు చేపడుతున్నట్లు జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పేర్కొంది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిని ఆదేశాలు 2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: