ప్రభుత్వ పెన్షన్‌ కోసం అంధురాలిగా మారిన మహిళ !!

Updated on: Apr 07, 2023 | 9:42 AM

ప్రభుత్వాలు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఆసరా ఉండేందుకు వారికి పెన్షన్‌ రూపంలో నెల నెలా కొంత నగదును అందిస్తాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. అయితే ఎప్పుడో అప్పడు పట్టుబడతారు..

ప్రభుత్వాలు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఆసరా ఉండేందుకు వారికి పెన్షన్‌ రూపంలో నెల నెలా కొంత నగదును అందిస్తాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. అయితే ఎప్పుడో అప్పడు పట్టుబడతారు.. మొత్తానికే మోసపోతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఇటలీలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కోసం ఓ మహిళ తానొక అంధురాలిగా నటించింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 ఏళ్లు అలా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి వికలాంగ పెన్షన్‌ అందుకుంది. ఎంత తెలివైనవారైనా ఎక్కడో అక్కడ వారు చేసే చిన్నపొరపాటు వారి బండారాన్ని బయటపెడుతుంది. ఇక్కడా అదే జరిగింది. ఇటలీకి చెందిన ఓ 48 ఏళ్ల మహిళ తాను ఒక అంధురాలిని తెలిపే ధృవపత్రాన్ని ఓ డాక్టర్‌నుంచి సంపాదించింది. ఆపై సామాజిక భద్రత పింఛన్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ధృవీకరణ పత్రాలు చూసి ఆమెకు పింఛన్‌ మంజూరు చేశారు అధికారులు. 15 ఏళ్లలో ఆమె ప్రభుత్వంనుంచి పెన్షన్‌ రూపంలో రెండు లక్షల 8 వేల యూరోలు అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు కోటి 8 లక్షల రూపాయలు పొందింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఇదేం లొల్లి! మత్తులో మచ్చెమటలు పట్టించింది

చిలుక ఆస్కార్‌ పెర్‌ఫార్మెన్స్‌.. వీడియో చూసి తీరాల్సిందే

తాగి నడిపినందుకు తిక్క కుదిరింది !! ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందంటే ??

Published on: Apr 07, 2023 09:42 AM
Follow Us