రీల్స్‌ కోసం వెళ్లి..వందే భారత్ ఢీకొట్టి నలుగురు మృతి వీడియో

Updated on: Oct 04, 2025 | 5:55 PM

బీహార్‌లోని పూర్నియా-కస్పా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రైలు పట్టాల వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రీల్స్ పిచ్చి ప్రమాదాలపై ఆందోళన రేకెత్తిస్తోంది.

రీల్స్‌ సరదా బీహార్‌ రాష్ట్రంలో నలుగురు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం బీహార్‌లోని పూర్నియా, కస్పా రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.పూర్నియా సమీపంలోని గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు తెల్లవారుజామున రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఉదయం సమయంలో ఆ మార్గంలో వందే భారత్ రైలు వస్తుందని తెలిసి, రైలు తమ వీడియోలో వచ్చే విధంగా చిత్రీకరించేందుకు చీకట్లోనే అక్కడికి చేరుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో