ప్రాణం మీదకు తెచ్చిన సంప్రదాయం.. చేపను మింగిన చిన్నారి.. చివరకు
మ సంతానం ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఇలా సంప్రదాయాలు ఆచరించే క్రమంలో జరిగే పొపాట్ల వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్, మొహమ్మది దంపతులకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.
తమ సంతానం ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఇలా సంప్రదాయాలు ఆచరించే క్రమంలో జరిగే పొపాట్ల వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్, మొహమ్మది దంపతులకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం. శనివారం చేపపిల్లను తెచ్చి చిన్నారి పెదవులకు తాకించే ప్రయత్నం చేయగా.. చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పసివాడు చేపపిల్లను మింగే క్రమంలో అది గొంతులో ఇరుక్కొని పిల్లాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్ ప్లేయర్లకు కాసులవర్షం
భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..
మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల
హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??