30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి

Updated on: Oct 14, 2025 | 6:01 PM

స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని చాలామంది స్టాక్స్‌ లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇక్కడ అన్నిసార్లూ లాభాలు వస్తాయని చెప్పలేం. కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచ్చేసాయి. ఈ స్టాక్స్‌ కొనడం, అమ్మడం లాంటివి చాలా ఈజీ అయిపోయింది.

ఓ 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే షేర్ మార్కెట్ లావాదేవీలు జరిగేవి. అలా అప్పట్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఓ వ్యక్తికి ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ పోస్టు ప్రకారం.. సుమారు 30ఏళ్ల క్రితం ఓ వ్యక్తి షేర్లు కొనుగోలు చేశాడు. తర్వాత కొన్నాళ్లకి ఆ పేపర్లు ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరకటంతో ప్రస్తుతం వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కటి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్‌కి సంబంధించిన వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయిందని తెలుసుకుని ఎగిరి గంతేశాడు. 2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. అలా ఆ వ్యక్తి ఊహించని విధంగా కోటీశ్వరుడయ్యాడు. ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ కావటంతో.. నెటిజన్లు సైతం వావ్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్న్‌ అవుట్ బాధితులుగా మిలీనియల్స్.. కారణమిదే

8 బతికిన కప్పల్ని మింగేసిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు

శోభితతో నా పరిచయం అక్కడే… వైరల్‌గా చైతూ కామెంట్స్

శతాయువు కోసం జపనీయుల పంచతంత్రం

UPI payments: ఇక.. ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు