Crime: అడ్రెస్ అడిగిన పాపానికి కత్తితో దాడి.. ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌కు చేదు అనుభవం.

|

Aug 26, 2023 | 9:28 PM

ఢిల్లీ లోని ద్వారకా సెక్టార్‌ 23 ప్రాంతానికి డెలివరీ చేసేందుకు గోలూ అనే డెలివరీ ఏజెంట్‌ వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళ ను అడ్రెస్‌ అడిగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 42 ఏళ్ల మహిళ గోలూపై దాడికి దిగింది. అతన్ని స్కూటీపై నుంచి కిందకి లాగి కత్తి తో మూడు, నాలుగు సార్లు దారుణంగా దాడి చేసి గాయపరిచింది. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేసింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఢిల్లీ లోని ద్వారకా సెక్టార్‌ 23 ప్రాంతానికి డెలివరీ చేసేందుకు గోలూ అనే డెలివరీ ఏజెంట్‌ వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళ ను అడ్రెస్‌ అడిగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 42 ఏళ్ల మహిళ గోలూపై దాడికి దిగింది. అతన్ని స్కూటీపై నుంచి కిందకి లాగి కత్తి తో మూడు, నాలుగు సార్లు దారుణంగా దాడి చేసి గాయపరిచింది. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేసింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి యత్నించింది. దీంతో స్థానిక మహిళల సాయంతో ఆ మహిళ చేతిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె మరింత కోపంతో ఓ కానిస్టేబుల్‌ చేతిలోని లాఠీని లాక్కుని సమీపంలోని పోలీసు వాహనం, ఇతర కార్లను ధ్వంసం చేసింది. ఎలాగోలా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన డెలివరీ ఏజెంట్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. అయితే, ఆ మహిళ స్థానిక డీడీఏ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోందని స్థానిక మహిళలు తెలిపారు. గతంలో కూడా కొందరు స్థానికులతో ఇలాగే ప్రవర్తించిందని, కొందరిపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...