టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??

|

Nov 24, 2024 | 11:36 AM

తినే ఆహారం కల్తీ, తాగే పాలు కల్తీ.. ఆఖరికి చాయ్‌ కూడా కల్తీనే. ప్రజారోగ్యం పాలిట కల్తీ మాఫియా కాలయముడిలాగా తయారయింది. ఈ కల్తీగాళ్ల విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది టీవీ9. ఫుడ్‌ సేఫ్టీపై వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. చాయ్‌పత్త కల్తీపై గ్రౌండ్ రిపోర్ట్‌ ఇప్పుడు చూద్దాం. కల్తీకి కాదేది అనర్హం. ఏపీలో చాయ్‌పత్తాను కూడా కల్తీ చేశారు.

టీ పొడి తయారీకి వాడే ఏ ఒక్కటీ వాడకుండానే టీపొడి తయారు చేస్తున్నారు. చూడ్డానికి చాయ్‌పత్తా లాగానే ఉంటుంది. కానీ దీనిని రకరకాల చెత్తతో తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో నకిలీ టీ పొడి గుట్టు రట్టయింది. రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తోన్నారు. వెయ్యి కిలోల కల్తీ చాయ్‌పత్తాను పోలీసులు సీజ్ చేశారు. టీ పొడి శాంపిల్స్‌ను టెస్ట్‌ కోసం ల్యాబ్‌కు పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. చూశారుగా టీపొడి ఎలా తయారవుతుందో. ఒడిశాకు చెందిన కూలీలను తీసుకొచ్చి బేకింగ్ పౌడర్.. చింతపిక్కలపొడి.. జీడిగింజలపైన ఉండే తుక్కుతో టీ పొడి తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. దీంతో వెయ్యి కిలోల నకిలీ టీ పొడిని సీజ్ చేశారు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. నకిలీ టీ పొడిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపామంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి రుక్కయ్యతో మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య ఫేస్‌ టు ఫేస్‌.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!

లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం.. ఏం జరిగిందంటే ??

కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం

వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??