పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??

|

Oct 13, 2024 | 7:06 PM

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో అరుదైన పాము కనిపించింది. చాకలిపేటలో ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తుపై కనిపించిన ఈ వింతపాము శరీరంపై నలుపు, ఎరుపు, బంగారు రంగులలో రింగులను పోలిన చారలు ఉన్నాయి. ఈ వింత పామును చూసి భయపడిన ఆ ఇంటివారు స్థానికులకు విషయం చెప్పారు. విషయం చుట్టుపక్కల అందరికీ పాకడంతో ఈ వింత పామును చూసేందుకు జనం ఆ ఇంటికి క్యూ కట్టారు. అరుదైన పామును ఆసక్తిగా చూసారు.

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో అరుదైన పాము కనిపించింది. చాకలిపేటలో ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తుపై కనిపించిన ఈ వింతపాము శరీరంపై నలుపు, ఎరుపు, బంగారు రంగులలో రింగులను పోలిన చారలు ఉన్నాయి. ఈ వింత పామును చూసి భయపడిన ఆ ఇంటివారు స్థానికులకు విషయం చెప్పారు. విషయం చుట్టుపక్కల అందరికీ పాకడంతో ఈ వింత పామును చూసేందుకు జనం ఆ ఇంటికి క్యూ కట్టారు. అరుదైన పామును ఆసక్తిగా చూసారు. అనంతరం ఆ పాము గురించి స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా పామును పట్టుకుని, సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఈ పాముగురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు స్నేక్‌ క్యాచర్‌. ఈ అరుదైన పాము రాత్రిపూట సంచరిస్తుందని, ఇది చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉంటుందని, ఇది ఒక చోటి నుంచి మరోచోటికి దూకుతుందని చెప్పారు. అవసరాన్ని బట్టి ఎగిరేలా తన శరీరాకృతిని ఈ పాము మలుచుకుంటుందని, ఒకేసారి 100 మీటర్ల వరకూ ఇది ఎగరగలదని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డిగ్రీతో గూగుల్‌లో రూ.1. 64 కోట్ల ప్యాకేజ్‌

ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా