పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో అరుదైన పాము కనిపించింది. చాకలిపేటలో ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తుపై కనిపించిన ఈ వింతపాము శరీరంపై నలుపు, ఎరుపు, బంగారు రంగులలో రింగులను పోలిన చారలు ఉన్నాయి. ఈ వింత పామును చూసి భయపడిన ఆ ఇంటివారు స్థానికులకు విషయం చెప్పారు. విషయం చుట్టుపక్కల అందరికీ పాకడంతో ఈ వింత పామును చూసేందుకు జనం ఆ ఇంటికి క్యూ కట్టారు. అరుదైన పామును ఆసక్తిగా చూసారు.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో అరుదైన పాము కనిపించింది. చాకలిపేటలో ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తుపై కనిపించిన ఈ వింతపాము శరీరంపై నలుపు, ఎరుపు, బంగారు రంగులలో రింగులను పోలిన చారలు ఉన్నాయి. ఈ వింత పామును చూసి భయపడిన ఆ ఇంటివారు స్థానికులకు విషయం చెప్పారు. విషయం చుట్టుపక్కల అందరికీ పాకడంతో ఈ వింత పామును చూసేందుకు జనం ఆ ఇంటికి క్యూ కట్టారు. అరుదైన పామును ఆసక్తిగా చూసారు. అనంతరం ఆ పాము గురించి స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును పట్టుకుని, సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఈ పాముగురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు స్నేక్ క్యాచర్. ఈ అరుదైన పాము రాత్రిపూట సంచరిస్తుందని, ఇది చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉంటుందని, ఇది ఒక చోటి నుంచి మరోచోటికి దూకుతుందని చెప్పారు. అవసరాన్ని బట్టి ఎగిరేలా తన శరీరాకృతిని ఈ పాము మలుచుకుంటుందని, ఒకేసారి 100 మీటర్ల వరకూ ఇది ఎగరగలదని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

