Flying car Video: అతి త్వరలో మార్కెట్‌లోకి గాల్లో ఎగిరే కారు.! ఎక్కడంటే..? పూర్తి వివరాలు ఈ వీడియోలో..
ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చాలా మందికి ఓ ఐడియా వస్తుంటుంది. మా కారుకు రెక్కలుంటే ఎంత బాగుండో అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారి కోరికను తీర్చేందుకు ఓ కారు సంస్థ ముందుకొచ్చింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ
ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చాలా మందికి ఓ ఐడియా వస్తుంటుంది. మా కారుకు రెక్కలుంటే ఎంత బాగుండో అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారి కోరికను తీర్చేందుకు ఓ కారు సంస్థ ముందుకొచ్చింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.70 గంటల పాటు టెస్టు ఫ్లైట్, 200 సార్లకుపైగా ల్యాండింగ్, టేకాఫ్‌ల తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ప్రమాణాలను ఈ కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్ కారు 200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు పడుతుందని తెలిపారు.