Dawood Ibrahim: మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలుసా?
ముంబై బాంబే పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడనే విషయం భారత్ నిఘా వర్గాలు ఎప్పుడో కనిపెట్టాయి. దావూద్‌ను అప్పగించాలని మన ప్రభుత్వం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా,
ముంబై బాంబే పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడనే విషయం భారత్ నిఘా వర్గాలు ఎప్పుడో కనిపెట్టాయి. దావూద్‌ను అప్పగించాలని మన ప్రభుత్వం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఆతను తమ దేశంలోనే లేడంటూ పాక్ ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. తాజాగా దావూద్ పొరుగు దేశంలోనే ఉన్నాడని మరో ఆధారం దొరికింది.ఈ కీలక సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్ద్వారా రాబట్టింది.. దావూద్ ఆస్తులకు సంబంధించిన మనీలాండర్ కేసుల విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు పలు మార్లు అలిశా పార్కర్‌కు సమన్లు ఇచ్చారు.. వీటిని ఆయన పట్టించుకోలేదు.. దీంతో అలిశా పార్కర్ ఆదుపులోకి తీసుకొని విచారించారు.. తాను పుట్టక ముందే తన మామా దావూద్ ముంబై వదిలిపారిపోయాడని చెప్పారాయన.. అయితే దావూద్ పాకిస్తాన్‌లో ఉన్నాడని తమ బంధువుల ద్వారా తెలిసిందన్నారు.. దావూద్ తమ కుటుంబంతో టచ్‌లో లేకున్నా, తమ భార్య కుటుంబ సభ్యులతో పండుగల సమయంలో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుసన్నాడు అలిశా పార్కర్. ఈ కీలక వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. కాగా దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని తేలినందున ఆయన్ని పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
