నీకు పెద్ద పెద్ద కొమ్ములుంటే నాకేంటి.. ఎద్దుతో తలపడిన మేకపోతు !! చివరికి ??
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ ఎద్దుతో మేకపోతు తలపడిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మేకపోతు చాలా కోపంగా ఊగిపోతూ పరుగెత్తుకొస్తోంది. ఇవాళ ఏమైనా సరే నీ అంతు చూస్తే తప్ప వదిలి పెట్టను అన్నట్టుగా వెళ్తోంది. ఇంతకీ ఎవరిమీదకో తెలుసా.. ఓ ఎద్దు మీదకి. అక్కడ చెట్టుకు కట్టేసి ఓ ఎద్దు ఉంది. ఆ ఎద్దుకి, ఈ మేకపోతుకి మధ్య వైరమేంటో తెలియదు కానీ.. వేగంగా వచ్చి ఆ ఎద్దుపై ఎటాక్ చేసింది మేకపోతు. ఎద్దు ఊరుకుంటుందా.. చెప్పండి.. దాని పొడవైన కొమ్ములతో మేకపోతును ఒక్కసారిగా ఎత్తి అవతల పడేసింది. దెబ్బకి చచ్చానురో దేవుడో అంటూ అక్కడే పడిపోయింది మేకపోతు. అందుకే అవతలి వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నా తక్కువ అంచనా వేయకూడదు.. ఈవీడియోను ఓ యూజర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అర్థం లేకుండా ఎవరూ తమ గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది మరీ..అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, తగ్గి ఉన్నారు కదా అని మనకంటే బలవంతులను ఆటపట్టించాలని చూస్తే తగిన శాస్తి తప్పదని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లితో మసాజ్ మామూలుగా ఉండదు.. ఛార్జీ ఎంత అని అడుగుతున్న నెటిజన్లు
ఇతని డ్రైవింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్ చేస్తుందంటున్న నెటిజెన్స్
Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి