చిరుత వర్సెస్ టైగర్.. విన్నర్ ఎవరో తెలుసా ??
మనుషులకు ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో జంతువులకు కూడా అంతే ముఖ్యం. మనుగడ కోసం రేసులో వేగం, చురుకుదనం వాటికి కీలకం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అదే కనిపిస్తుంది..
మనుషులకు ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో జంతువులకు కూడా అంతే ముఖ్యం. మనుగడ కోసం రేసులో వేగం, చురుకుదనం వాటికి కీలకం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అదే కనిపిస్తుంది.. ఒక అడవిలో పులి అడ్డాలోకి చిరుత వచ్చింది. దానిని చూసిన పెద్దపులి.. వెంటనే దానిని ఎటాక్ చేయబోయింది. చిరుత సంగతి తెలుసుకదా.. వేగంలో చిరుతను మించినది మరొకటి ఉండదు. పులితన వైపు రావడం గమనించిన చిరుత వేగంగా కదిలింది. పులి దగ్గరకు రాగా ఒక్క ఉదుటన చెట్టుపైకి ఎక్కేసింది. పులిమాత్రం తక్కువ తిందా… తాను కూడా చిరుతను వెంబడిస్తూ చెట్టెక్కింది. కానీ దాని అధిక బరువు కారణంగా చెట్టుపై వరకూ ఎక్కలేకపోయింది. యంగ్‌గా ఉన్న చిరుత చకా చకా ఎకేసి చిటారుకొమ్మన కూర్చుంది. పులి మాత్రం సగంలోనే ఆగిపోయింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఈ వీడియోలో పెద్దపులి- చిరుతపులి మధ్య జీవనపోరాటం.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR తరువాత.. గ్లోబల్ అవార్డ్స్‌లో దూసుకుపోతున్న బలగం..
ఇంటర్నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా బలగం వేణు
ఇలాంటి పెళ్లి మీరెప్పుడు చూసి ఉండరు..
ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!
యువకుల ఐడియాకు ఆనంద్ మహీంద్రా షాక్ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

