AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

Phani CH
|

Updated on: Jul 15, 2026 | 8:08 PM

Share

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుమారుడు క్యాన్సర్‌తో మరణించడంతో వితంతువైన కోడలిని కూతురిలా భావించిన దినేష్ వైరాగి, ఆమెకు తగిన వరుడిని చూసి స్వయంగా కన్యాదానం చేసి రెండో పెళ్లి జరిపించారు. ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలవడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వితంతు పునర్వివాహంపై సానుకూల సందేశాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

ఒక సినిమాలో హీరో తన భార్య అంతకు ముందు వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను, అత్తమామలకు నచ్చజెప్పి.. తన భార్యకు తండ్రిలా మారి.. ఆమె ఇష్టపడుతున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. సేమ్‌ అలాంటి సీనే నిజ జీవితంలోనూ జరిగింది. కాకపోతే ఇక్కడ మామగారు తన కోడలికి తండ్రిలా మారి కన్యాదానం చేశాడు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోపాల్‌కు చెందిన దినేష్ వైరాగి అనే వ్యక్తి తన కుమారుడికి వైభవంగా పెళ్లిజరిపించాడు. దురదృష్టవశాత్తు కొంతకాలానికే కుమారుడు క్యాన్సర్‌తో చనిపోయాడు. కొడుకు చనిపోయాడన్న దుఃఖం ఓవైపు, చిన్న వయసులోనే కోడలు వితంతువుగా మారిందనే ఆవేదన మరోవైపు ఆయనను కలచివేసింది. అతి కష్టంమీద ఈ దుఃఖం నుంచి తేరుకున్న దినేష్ కుటుంబం.. కోడలిని ఒంటరిగా వదిలేయకూడదని నిశ్చయించుకుంది. ఆమెకు ఎలాగైనా న్యాయం చేయాలని, తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని భావించారు. కోడలిని సొంత కూతురిలా భావించి, అండగా నిలిచారు. కోడలికి తగిన వరుడిని వెతికి, ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లిలో మామ దినేష్ వైరాగి స్వయంగా కన్నతండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేయడం అందరినీ కదిలించింది. “మా కోడలు కొత్త జీవితాన్ని ప్రారంభించడం మా బాధ్యతగా భావించాం. ఈ నిర్ణయం సమాజానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను” అని దినేష్ వైరాగి పేర్కొన్నారు. వియ్యంకుడి కుటుంబం చూపిన ఈ అపారమైన ప్రేమ, ఆదరణపై కోడలి తండ్రి రాంబాబు వైరాగి ఆనందబాష్పాలు రాల్చారు. వితంతువుల పట్ల సమాజంలో ఉన్న మూస ధోరణులను మార్చేలా వైరాగి కుటుంబం తీసుకున్న ఈ ప్రగతిశీల నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడలికి కొత్త జీవితం ఇచ్చిన మామ! నువ్వు సూపర్‌..

Published on: Jul 15, 2026 08:07 PM
Follow Us