Viral: ఛీ.. వీడు అసలు తండ్రేనా.! కూతురికి డ్రింక్ ఇచ్చి అఘాయిత్యం..!
ఆడపిల్లకు రక్షణ అనేదే లేదా? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఎప్పుడూ రక్షగా ఉంటానని రాఖీ కట్టించుకునే అన్న.. అందరూ మగాళ్లేనా.. బంధాలు, వావి వరుసలు లేవా? ఆడది అయితే చాలా? అది పసిపిల్లా, వృద్ధురాలా, తల్లా, చెల్లా అనేది అవసరం లేదా? కన్నబిడ్డలనే కామంతో చూస్తుంటే.. ఇక బయటివాళ్ల పరిస్థితేంటి? ఆడపిల్లలు మనగలిగేది ఎలా? ఎటు పోతోంది సమాజం? తల్లికి, ఐదేళ్ల బిడ్డకి మత్తుమందు కలిపి ఇచ్చి పసి పిల్లపై అఘాయిత్యానికి పాల్పడితే వాడిని ఏమనాలి?
ఆడపిల్లకు రక్షణ అనేదే లేదా? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఎప్పుడూ రక్షగా ఉంటానని రాఖీ కట్టించుకునే అన్న.. అందరూ మగాళ్లేనా.. బంధాలు, వావి వరుసలు లేవా? ఆడది అయితే చాలా? అది పసిపిల్లా, వృద్ధురాలా, తల్లా, చెల్లా అనేది అవసరం లేదా? కన్నబిడ్డలనే కామంతో చూస్తుంటే.. ఇక బయటివాళ్ల పరిస్థితేంటి? ఆడపిల్లలు మనగలిగేది ఎలా? ఎటు పోతోంది సమాజం? తల్లికి, ఐదేళ్ల బిడ్డకి మత్తుమందు కలిపి ఇచ్చి పసి పిల్లపై అఘాయిత్యానికి పాల్పడితే వాడిని ఏమనాలి? భర్త దారుణాన్ని గమనించిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అయిదేళ్ల కుమార్తెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మాచర్లలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి వెల్దుర్తి మండలానికి చెందిన మహిళతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. రెండేళ్ల కిందట తన మూడేళ్ల పెద్ద కుమార్తెతో భర్త అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని భార్య గమనించింది. భర్త తీరుతో వేదనకు గురైంది. మనస్తాపంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
రెండు నెలల కిందట తాను మారిపోయానని, ఇకపై అలా ప్రవర్తించనని నమ్మబలికి, పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ చేయించి భార్యను తిరిగి మాచర్లకు తీసుకొచ్చాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. పదిరోజులుగా రాత్రి వేళల్లో అతడు కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి భార్య, కుమార్తెకు తాగిస్తూ వచ్చాడు. ఆపై కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం వేళల్లో కూతురు మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుంటే అనుమానం వచ్చి తల్లి బిడ్డను తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో పరీక్షలు చేయించింది. అక్కడి వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. తన భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడిని కఠినంగా శిక్షించాలని ఆమె మంగవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ ప్రభాకరరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి డీఎస్పీకి నివేదికలు అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.