Awesome Facebook: 58 ఏళ్ల క్రితం విడిపోయిన తండ్రి కూతుళ్లు.. కలిపిన ఫేస్ బుక్..! వైరల్ అవుతున్న వీడియో..
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది సోషల్ మీడియాలోనే విహరిస్తుంటారు. అయితే సోషల్ మీడియా వల్ల నష్టాలు, లాభాలు కూడా ఉన్నాయి. అసలు విషయమేంటంటే..
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది సోషల్ మీడియాలోనే విహరిస్తుంటారు. అయితే సోషల్ మీడియా వల్ల నష్టాలు, లాభాలు కూడా ఉన్నాయి. అసలు విషయమేంటంటే.. సోషల్‌మీడియాలో భాగమైన ఫేస్ బుక్ ద్వారా గతంలో విడిపోయిన ఎందరో వ్యక్తులు తిరిగి కలిసిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ కారణంగా ఓ మహిళ 58 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. దాంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.
ఇంగ్లండ్, లింకన్‌షైర్‌కు చెందిన 59 ఏళ్ల జూలీ లెయిడ్ అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు తన తండ్రి నుంచి దూరమయ్యింది. అప్పట్లో ఇంత సాంకేతికత లేకపోవడం వల్ల తండ్రిని వెతకడం కష్టం అయ్యింది. కానీ చనిపోయేలోపు తండ్రిని చూడాలని బలంగా నిర్ణయించుకుంది జూలీ. ఆమె ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు. తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలో జూలీకి ఓ ఐడియా వచ్చింది. తన తండ్రిని వెతకడంలో సోషల్‌మీడియా సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. వెంటనే ఆమె తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దయచేసి తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాల్సిందిగా నెటిజనులను కోరింది. అప్పటినుంచి తండ్రి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూసింది. సరిగ్గా నాలుగు రోజులు తిరిగేసరికి అద్భుతం జరిగింది. ఆమె తండ్రి ఆచూకీ తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ ప్రత్యక్షం అయ్యింది. అందులో ఉన్న అడ్రస్‌కు వెళ్లి.. తండ్రిని కలుసుకుంది. ఇక జూలీ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు. ఇన్నేళ్ల తర్వాత కలిసిన తన తండ్రితో వెస్ట్ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో తండ్రితో కలిసి తిరుగుతూ ఆనందంగా గడిపింది. ఈ సందర్భంగా జూలీ ఫేస్‌బుక్ నాకు చేసిన మేలు నిజంగా అద్భుతం.. ఇది ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..