Viral Video: ఉడుముకు రంగురంగుల డ్రెస్‌లు, తొండకు టోపీలు.. ఇదెక్కడి ఫ్యాషన్‌రా బాబు.. వైరల్‌ వీడియో..

Viral Video: మానవ పరిణామ క్రమంలో దుస్తులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులకు గౌరవాన్ని పెంచడంలో దుస్తులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే...

Viral Video: ఉడుముకు రంగురంగుల డ్రెస్‌లు, తొండకు టోపీలు.. ఇదెక్కడి ఫ్యాషన్‌రా బాబు.. వైరల్‌ వీడియో..
Viral Video
Follow us

|

Updated on: Dec 08, 2021 | 12:32 PM

Viral Video: మానవ పరిణామ క్రమంలో దుస్తులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులకు గౌరవాన్ని పెంచడంలో దుస్తులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే మంచి మంచి దుస్తులు ధరిస్తూ తమ గొప్పతనాన్ని నలుగురికి చాటడానికి ప్రయత్నిస్తుంటారు. మనుసుల అవసరాలను తీర్చడానికి పెద్ద పెద్ద కంపెనీలు సైతం వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఇందులో భాగంగానే రకరకాల ఫ్యాషన్స్‌లలో దుస్తులను రూపొందించడం ప్రారంభించారు. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితమా అంటే కానే కాదంటున్నారు కొందరు డిజైనర్లు. ఇప్పటికే శునకాలు, పిల్లుల ఫ్యాషన్‌కు సంబంధించిన దుస్తులు ఇప్పటికే చూశాం. అయితే ఫ్యాషన్‌ బ్రాండ్ కంపెనీ అనే సంస్థ ఈ విషయంలో ఓ మెట్టు పైకెక్కింది.

ఫ్యాషన్‌ రంగంలో మంచి సంస్థగా పేరుగాంచిన ‘ఫ్యాషన్‌ బ్రాండ్‌’ మనుషులతో పాటు పలు రకాల ప్రాణులకు కూడా ఫ్యాషన్‌ డిజైన్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే తొండలు, ఉడుములకు సంబంధించిన డ్రెస్‌లను డిజైన్‌ చేశాయి. అయితే ఇవేవో అషామాషీగా ఉన్నాయంటే మీరు పొరపడినట్లే.. ఎందుకంటే మనుషులు వేసుకునే డ్రస్‌లకు ఇవి ఏమాత్రం తీసిపోవు. అయితే చిన్నగా ఉన్నాయి కదా ధర తక్కువ ఉంటుందేమో అనుకుంటే మీరు పొరబడినట్లే ఎందుకంటే ఈ దుస్తుల ధరలు రూ. పదివేలకు పైమాటే..

ఇలా రకరకాల ప్రాణులకు వేసిన డ్రస్‌లను ఫోటోలుగా తీసి తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అంత చిన్న డ్రస్‌లను అద్భుతంగా తయారు చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంస్థకు చెందిన ఈ వెరైటీ ఫ్యాషన్‌కు సంబంధించిన ఫోటోలను మీరూ చూసేయండి..

Also Read: Strange Sounds: చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వింత శబ్దాలు.. వరుస ప్రకంపనలతో జనం పరుగులు..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..

TS EAMCET: లెక్క తగ్గుతోంది.. ఇంజనీరింగ్ వద్దు.. ఫార్మసే ముద్దు.. ఏకంగా 95 శాతం సీట్ల భర్తీ..