బీర తోటలో కోతి ఫ్లెక్సీ పెట్టిన రైతు.. ఎందుకో తెలుసా ??

|

Sep 11, 2023 | 7:36 PM

మంత్రాలకు చింతకాయలు రాలవు.. అలాగే నరుడి దిష్టికి పంట నాశనం కాదు. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. తెలంగాణాలో ఓ రైతు నరుని దిష్టి తగిలి ఏపుగా పెరిగిన పంట నాశనం అవుతుందని భయపడి తన పొలంలో కోతి బొమ్మతో ఉన్న కటౌట్ పెట్టి వినూత్న మార్గంలో తన పంటను కాపాడుకుంటున్నాడు. సిద్ధిపేటలో ఓ రైతుకు తారు రోడ్డు పక్కనే వ్యవసాయ పొలం ఉంది. అందులో నెలరోజుల క్రితం బీరకాయ సాగు చేశాడు.

మంత్రాలకు చింతకాయలు రాలవు.. అలాగే నరుడి దిష్టికి పంట నాశనం కాదు. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. తెలంగాణాలో ఓ రైతు నరుని దిష్టి తగిలి ఏపుగా పెరిగిన పంట నాశనం అవుతుందని భయపడి తన పొలంలో కోతి బొమ్మతో ఉన్న కటౌట్ పెట్టి వినూత్న మార్గంలో తన పంటను కాపాడుకుంటున్నాడు. సిద్ధిపేటలో ఓ రైతుకు తారు రోడ్డు పక్కనే వ్యవసాయ పొలం ఉంది. అందులో నెలరోజుల క్రితం బీరకాయ సాగు చేశాడు. అది ఏపుగా పెరిగి కాయలు కాయడంతో అటుగా వెళ్లే వాహన దారులు, బాటసారుల చూపు ఆ చేనుపై పడుతోంది. కోతి ఫొటోతో ఫ్లెక్సీని తయారు చేకించి .. నన్ను చూసి ఏడవకురా అంటూ.. పెద్ద అక్షరాలతో కొటేషన్ రాసి చేనులో ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. సాధరణంగా మొక్కజొన్న, చెరకు, కూరగాయలు పండించే పంటలకు రైతులే కాపాలా ఉంటారు. అయితే ఈ రైతు కోతి బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని రోడ్డు వెంబడి వెళ్లే వాహనాదారులు వింతగా చూస్తున్నారు. వాస్తవానికి రోడ్డు వెంట ఉండే పంటలకు చాలా వరకు రక్షణ ఉండదు. ఈ క్రమంలో రైతు ఇలా కోతి బొమ్మతో ఫ్లేక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయం అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం

ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..

Heart Attack Restaurant: హార్ట్‌ ఎటాక్‌ రెస్టారెంట్‌.. ఫుడ్ తినాలంటే గుండె ధైర్యం కావాలి

మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా !! ఇప్పటికే 13 మంది మృత్యువాత

అనారోగ్యంతో గుహలో చిక్కుకుపోయిన అమెరికా అన్వేషకుడు !!